కులం పేరుతో దూషించిన వ్యక్తిపై కేసు నమోదు

*కులం పేరుతో దూషించిన వ్యక్తులపై కేసు నమోదు చేసిన సీఐ రవి*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 2*

కులం పేరుతో దూషించిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట సిఐ వరగంటి రవి తెలిపారు వివరాలు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లికి చెందిన సమ్మయ్య (65) సింగరేణి ఎంప్లాయ్ గా పనిచేసి రిటైర్ అయి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. పల్లపు తిరుపతి అనే వ్యక్తి పాత పగలు మనసులో పెట్టుకొని అతను,అతని భార్య పల్లెపు స్వరూప గుంజీకర్ ప్రకాష్ గుంజికర్ సింధు పల్లెపు అరవింద్ 31-7-2024 రోజున సాయంత్రం 5:30 గంటలకు మద్యం సేవించి మా ఇంటి దగ్గర వచ్చి నన్ను నా భార్య కనకమ్మ ను నా కొడుకు రాజేష్ ను ఇష్టం వచ్చినట్లు కులం పేరుతో బూతు మాటలు తిట్టుచూ చేతులతో కొట్టి కులం పేరుతో తిట్టి కొట్టినారని దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవి తెలిపారు.

Join WhatsApp

Join Now