ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 9 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం లో గత నాలుగు రోజుల క్రితం అనుమానస్పదంగా కేసు నమోదు చేసిన పోలీసులు.సోమవారం నాడు సిసి ఫుటేజ్ ఆధారంగా గ్రామస్తుల సమాచారం మేరకు ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు గోమారం గ్రామంలొ గత వారం రోజులు గా బిక్షాటన చేస్తూ కడుపు నింపుకుంటున్న గుర్తు తెలియని వ్యక్తి ని ఈ నెల నాలుగో తేదీన రాత్రి బస్టాండులో పడుకొని ఉండగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అతనిని విపరీతంగా కొట్టడం తో ఆ వ్యక్తి మృతి చెందాడు కొట్టిన వాళ్లు గోమారం గ్రామానికి చెందిన మణికంఠ గౌడ్. తిరుపతి రెడ్డిల గుర్తించి వారిని విచారించగా నేరం ఒప్పుకున్నారు వాళ్ల పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు.తెలిపారు