ఆర్పీ పట్నాయక్ కుమారుడిపై దాడి. కేసు నమోదు
గుచ్చిబౌలి ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్ లో సంగీత దర్శకుడి కుమారుడు వైష్ణవ్ బిబిఏ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. అదే స్కూల్ లో నాలుగో సంవత్సరం చదువుతున్న శ్యామ్ వైష్ణవ్ ను ర్యాగింగ్ చేయడంతో ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన మందలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ కోపంతో శ్యామ్ కాలేజి బస్సు మణికొండ సమీపంలోకి రాగానే వైష్ణవ్ పై దాడి చేశాడు. అంతేగాక చెవి కూడా కొరకడంతో రక్త గాయాలు అయ్యాయి. గురువారం రాత్రి ఆర్ పి పట్నాయక్ రాయదుర్గం పిఎస్ లో కుమారుడితో వెళ్లి ఫిర్యాదు చేయించాడు.