ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 21 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
పరిశ్రమల్లో పనికి వెళ్లిన యువకుడు అదృశ్యమైన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని దొంతి గ్రామానికి చెందిన దినేష్ రెడ్డి (25) కండ్లకోయలోని పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల19 పరిశ్రమకు విధులకు వెళ్లిన అతడు ఇంటికి తిరిగి రాలేదన్నారు. ఎక్కడ వెతికిన ఆచూకీ లభించకపోవడంతో తండ్రి తిరుపతిరెడ్డి ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు