Site icon PRASHNA AYUDHAM

రూ.63లక్షల గంజాయి పట్టివేత.. ముగ్గురిపై కేసు నమోదు..

IMG 20250825 201743

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ నుంచి రెండు కార్లలో 122.85 కేజీల గంజాయిని తరలిస్తుండగా.. సంగారెడ్డి డీటీఎఫ్ టీం సోమవారం పట్టుకున్నారు. ఏవోబీ నుంచి గంజాయి మహారాష్ట్రకు వెళుతుందనే సమాచారంతో సంగారెడ్డి కంది మండలం చేర్యాల గేటు వద్ద కాపు కాసి మహారాష్ట్రకు చెందిన వాహనాలను నిలిపి తనిఖీలు నిర్వహించారు. కార్లలో పైన చూస్తే.. ఏ రకమైనటువంటి గంజాయి కనిపించదు.. కానీ కారు డిక్కీలోనూ కారు బాడీ కింద ప్రత్యేకమైన అరలు చేయించి గంజాయిని సరఫరా చేస్తున్న విషయాన్ని డిటిఎఫ్ సిఐ దుబ్బాక శంకర్, నజీర్ పాషా సిబ్బంది కలిసి చేదించారు. ఒక కారులో 69.5 కేజీలు, మరో కారులో 53.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్ వహాబ్ సయ్యద్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తితో పాటు ఉమాకాంత్ సబర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. చాంద్ మహమ్మద్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ మెదక్ డిప్యూటీ కమిషనర్ జ్. హరి కిషన్ సంగారెడ్డిలోని ఎక్సైజ్ సూపరిడెంట్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. డీటీఎఫ్ టీం సభ్యులతో పాటు సంగారెడ్డి ఎక్సైజ్ సూపర్డెంట్ నవీన్ చంద్ర ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ కొనసాగింది. పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న సంగారెడ్డి డిటిఎఫ్ టీంను ఎక్సైజ్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ ఖాసీం అభినందించారు.

Exit mobile version