స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి.
స్కూల్ బస్సు కింద పడి నర్సరీ చదువుతున్న మనోజ్ఞ(3 )అనే చిన్నారి ఈరోజు ఉదయం దుర్మరణం చెందింది.మనోజ్ఞ తలపై నుంచి స్కూల్ బస్సు వెళ్లడంతో అక్కడిక్కడే మరణించింది. స్కూల్ మెనేజ్‌మెంట్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మహర్షి స్కూల్ ఆవరణలో ఈ విషాదం చోటుచేసు కుంది. నామాపూర్‌కి చెందిన భూమయ్య, వెంకటవ్వ కూతురు మనోజ్ఞ మహర్షి స్కూల్‌లో నర్సరీ చదువుతుంది. విద్యార్థి తల్లి ఒక వ్యవసాయ కూలీ, తండ్రి ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి వర్క్ చేస్తుంటారు. చిన్నారి చావుతో వారి కుటుంబం విషాదంలో మునిగిపో యింది.