భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి, 15 మందికి గాయాలు
ప్రశ్న ఆయుధం 24జులై హైదరాబాద్ :
- హైదరాబాద్ జియగూడలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంకటేశ్వర కాలనీలోని ఓ సోఫా తయారీ గోడౌన్ లో మంటలు చెలరేగాయి.పక్కనే ఉన్న నివాసాలకు మంటలు వ్యాపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా, 15 మందికి గాయాలు కాగా ఉస్మానియాకు తరలించారు.ఫైర్ ఇంజన్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మంటల్లో చిక్కుకున్న 25 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.