జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ గోల్డ్‌ మెడలిస్టులను సన్మానించిన కలెక్టర్‌

జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ గోల్డ్‌ మెడలిస్టులను సన్మానించిన కలెక్టర్‌

కామారెడ్డి యువ క్రీడాకారుల ప్రతిభ ప్రశంసనీయమని ఆశిష్‌ సాంగ్వాన్‌

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్‌ 25

 

జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలలో గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడాకారులను శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “జిల్లాకు మీరు తెచ్చిన గౌరవం విశేషం. ఇదే ఉత్సాహం, కృషి, పట్టుదలతో ముందుకు సాగి అంతర్జాతీయ స్థాయిలో కూడా విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.

క్రీడా రంగ అభివృద్ధికి జిల్లా యువజన, క్రీడాశాఖ అన్ని విధాలుగా సహకరిస్తుందని కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా శాఖ అధికారి రంగ వేంకటేశ్వర గౌడ్‌, అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జైపాల్‌రెడ్డి, కార్యదర్శి అనిల్‌, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment