హాస్టల్ విద్యార్థినులకు స్వెటర్లు పంపిణీ చేసిన కలెక్టర్

ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 28 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
చుంచుపల్లిలోని ఎస్సీ బాలికల ప్రీ మెట్రిక్ వసతి గృహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, అనంతరం స్వెట్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థినిలకు రక్షణ కోసం స్వెటర్లను అందజేయడం జరిగిందన్నారు. హాస్టల్ లో ఉండే విద్యార్థినిలకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని వార్డెన్ కు సూచించారు. హాస్టల్ విద్యార్థులు ప్రణాళికా బద్దంగా చదువుతూ ఉత్తమ ఫలితాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ అధికారి అనసూయ, హాస్టల్ వార్డెన్, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now