Site icon PRASHNA AYUDHAM

అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్,

అంగన్వాడీ కేంద్రానికి వచ్చే బాలింతలకు పాలు గుడ్లు కేంద్రంలోని అందించాలి.

అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్,

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్,

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని 2వ అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి అంగన్వాడి పిల్లల అభ్యాసన సామర్ధ్యాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాలను తప్పనిసరిగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఖచ్చితంగా నిర్వహించాలని సూచించారు. 3 సంవత్సరాలలోపు పిల్లలందరికీ బాలామృతంతో పాటు మంచి పౌష్టికాహారం అందజేసి వారి ఎదుగుదల ను ఎప్పటికప్పుడుగమనిస్తుండాలని సూచించారు. విద్యార్థుల రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. ఇంకనూ ఏమైనా మౌలికసదుపాయాలు అవసరం ఉన్నాయా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.బోధనా సిబ్బంది హాజరును, విద్యార్థులను పలుకరించి వారికి అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, రోజువారీ దినచర్య గురించి ఆరా తీశారు. పప్పు గుడ్లు బియ్యం నాణ్యతను పరిశీలించి, సకాలంలో సరుకులు అందేలా కాంట్రాక్టర్ కు ముందస్తు సమాచారం అందించి, విద్యార్థులకు అందించేందుకు సరైన సమయానికి నాణ్యమైన సరుకులు అందేలా చర్యలు చేపట్టాలని అంగన్వాడి సూపర్వైజర్ ను కలెక్టర్ ఆదేశించారు.విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడికి వచ్చే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, బాలింతలకు అంగన్వాడి కేంద్రంలోనే పాలు, ఉడకబెట్టిన గుడ్లును అందిస్తున్నారా లేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటికి సరుకులుఅందచేయకూడదనికేంద్రానికి వచ్చిన బాలింతలకు అంగన్వాడి కేంద్రంలోని అందించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రంలో విద్యార్థుల బరువు, ఎత్తు వివరాలను సైతం అడిగి తెలుసుకున్నారు.కలెక్టర్ వెంటా కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, వెల్దండ తాహసిల్దార్ కార్తీక్ కుమార్, అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీమతి, అంగన్వాడీ టీచర్ మాసమ్మ తదితరులు ఉన్నారు.

Exit mobile version