దివ్యాంగులు నిరుత్సాహ పడొద్దు,
దివ్యాంగులతో కలిసి క్రీడల్లో పాల్గొన్న కలెక్టర్,
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.
ఉత్సాహంగా విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు,
షార్ట్ పుట్ క్రీడా పోటీలో పాల్గొన్న కలెక్టర్,
ప్రస్తుత కాలంలో దివ్యాంగులమని నిరుత్సాహపడొద్దని, వికలత్వం అనేది శరీరానికే తప్ప మనస్సుకు, ఆలోచనకు కాదని నిరూపించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.
డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని గురువారం నాగర్ కర్నూల్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి దివ్యాంగుల క్రీడలను ప్రారంభించారు. డీడబ్ల్యూవో రాజేశ్వరి, సంబంధిత అధికారులు దివ్యాంగులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ట్రై సైకిల్ పరుగు, చేస్, క్యారమ్, షార్ట్ ఫూట్ ఆటల పోటీలు నిర్వహించగా కలెక్టర్ దివ్యాంగులను ఉత్సాహపరిచేందుకు షార్ట్ పుట్ క్రీడా పోటీల్లో కలెక్టర్ సైతం పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ దివ్యాంగులు ఇతరులకు ఏవిధంగా కూడా తీసిపోకుండా తమ శక్తి సామర్థ్యాలనుప్రదర్శిస్తున్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ప్రతీ ఏడాది డిసెంబర్ మూడో తేదీన జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించిందనీ,. ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో వైకల్యంతో బాధపడతారని, లక్ష్య సాధనలో అది వైకల్యం మాత్రమే తప్ప అసాధ్యమైనది కాదని కలెక్టర్ తెలిపారు. దివ్యాంగుల పట్టుదల, ఆత్మస్థైర్యాన్ని సాధారణ ప్రజలు సైతం స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. దివ్యాంగుల మెరుగైన జీవనానికి ఎంతో కీలకం అయిన విద్యా, ఉపాధి, ఆరోగ్యం, సంరక్షణ, సాంకేతికరంగాల్లో వారికి అవకాశాలు ఉండాలని . తద్వారా దివ్యాంగుల సాధికారతకు శ్రీకారం చుట్టాలని తెలిపినారు . క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు, పాల్గొన్న వారందరికీ డిసెంబర్ 3 న జరిగే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు ఇవ్వడం జరుగుతుందనితెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, వ్యాయామ ఉపాధ్యాయులు సుభాషిని, జిల్లా దివ్యాంగుల సంఘం సభ్యులు, దివ్యాంగులైన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.