నిబద్ధతతో అంకితభావంతో గల రాజమౌళి ఉపాధ్యాయుని ఆదర్శంగా తీసుకోవాలి

*నిబద్ధతతో అంకితభావంతో గల రాజమౌళి ఉపాధ్యాయుని ఆదర్శంగా తీసుకోవాలి*

*తన శేష జీవితంలో సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టాలి*

*వరంగల్ ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి పట్టణ సీఐ వరగంటి రవి*

*జమ్మికుంట జనవరి 6 ప్రశ్న ఆయుధం*

ఉపాధ్యాయుడు శెట్టి రాజమౌళిని ఉపాధ్యాయులు ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని తన శేష జీవితంలో సామాజిక సేవ కార్యక్రమాలను చేపట్టాలని వరంగల్ ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి, జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి అన్నారు. సోమవారం జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామ జడ్పీహెచ్ఎస్ పాఠశాల సోషల్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ గా పదవి విరమణ వీడ్కోలు అభినందన సమావేశం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి పట్టణ సీఐ వరగంటి రవి మాజీ జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ జ్యోతి ప్రజ్వలన చేశారు .ఈ సమావేశానికి ఆర్జేడి సత్యనారాయణ రెడ్డి, సీఐ వరగంటి రవి, జెడ్పి మాజీ చైర్పర్సన్ కనుమల్ల విజయ మండల విద్యాధికారి మంథని హేమలత లు హాజరై మాట్లాడుతూ గత 28 సంవత్సరాలుగా వివిధ పాఠశాలల్లో ఎంతో నిబద్దత, అంకితభావంతో విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించి, విద్యార్థుల, వారి తల్లిదండ్రుల మన్ననలు పొందడం ఎంతో అభినందనీయమని శెట్టి రాజమౌళి సమాజానికి ఉపయోగపడే వందలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దారని వారు కొనియాడారు. ఆయన జీవితము ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయం అతని శేష జీవితం ఆయురారోగ్యంతో ఉండాలని వారు ఆకాంక్షించారు విద్యార్థులు అలరించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం శాలువాతో, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య, ఎస్ టి యు జిల్లా ప్రధాన బాధ్యులు రవీందర్ రెడ్డి, ఆకుల సదానందం, తాటిపాముల భావన ఋషి, పొనగంటి రాజన్న, సంద ముత్తయ్య, మర్రి అవినాష్, కౌన్సిలర్లు పొనగంటి రాము, పొనగంటి సారంగం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now