నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
ఏడపల్లి నవంబర్ 05:
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతపూర్ గ్రామానికి చెందిన కంటె సత్యసాయి (19) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి చాలా సమయం గడిచిన అతను తిరిగి ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు వారి బంధువులను, సత్యసాయి స్నేహితులను సంప్రదించిన యువకుని ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం ఉదయం కూడా యువకుడు చదువుకునే కళాశాలలో, తదితర పరిసరాలలో ఆచూకీ కోసం ప్రయత్నం చేసి ఏమి జరిగిందో అనే అనుమానం వ్యక్తం చేస్తూ మంగళవారం మధ్యాహ్నం యువకుని తండ్రి కంటె వెంకటేశ్వర రావు ఎడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా, ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ వంశీకృష్ణ రెడ్డి ఈ యువకుడి ఆచూకీ ఎవరికైనా లభిస్తే ఎడపల్లి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని ప్రజలకు, స్థానికులను కోరారు. ఈ సంఘటనపై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.