Site icon PRASHNA AYUDHAM

పెట్రోలింగ్ సిబ్బందిని అడ్డుకున్న వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

IMG 20241226 WA0121

పెట్రోలింగ్ సిబ్బందిని అడ్డుకున్న వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

పోతంగల్ (ప్రశ్న ఆయుధం ) డిసెంబర్ 26.

పోతంగల్ మండలంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పోలీసు, రెవెన్యూ సిబ్బందితో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం పెట్రోలింగ్ చేస్తుండగా పోతంగల్ గ్రామంలో చెక్ పోస్ట్ వద్ద (తిరుమలాపూర్ క్రాసింగ్) వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ను సిబ్బంది నిలిపివేసి కోటగిరి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న సమయంలో పోతంగల్ మండల కేంద్రానికి చెందిన బజరంగ్ దత్తు అనే వ్యక్తి పెట్రోలింగ్ రెవిన్యూ సిబ్బందిని దౌర్ధాన్యంగా పక్కకు నెట్టివేసి వాహనం (కారు)లో ఎక్కకుండా దాదాపు 15 నిమిషాలు సిబ్బందిని అడ్డగించి, అక్రమ ఇసుక టిప్పర్ ను తరలించినాడు. అ ప్రదేశంలో ఇసుక టిప్పర్ల లోడ్ చేసిన నెంబర్ లేనటువంటి జేసిబి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ భద్రత కొరకు అప్పజెప్పడం జరిగిందని తహసిల్దార్ తెలిపారు.సిబ్బంది కారు వెళ్లకుండా అడ్డగించి, ప్రభుత్వ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించి, విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ సిబ్బంది పై దౌర్జన్యం చేసినాడు. పెట్రోలింగ్ రెవిన్యూ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన భజరంగ్ దత్తు అనే వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తహసిల్దార్ మల్లయ్య తెలిపారు.

Exit mobile version