నర్సాపూర్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

IMG 20250726 194510
మెదక్/నర్సాపూర్, జూలై 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. శనివారం నర్సాపూర్ లో డీసీ ఫంక్షన్ హాల్ లో 1987-88 సంవత్సరానికి సంబంధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు సమ్మేళనం జరుపుకున్నారు. చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఒక చోట చేరి చదువుకున్న విద్యార్థులంతా కూడా 35 ఏళ్ల తర్వాత కలుసుకోవడం ఎంతో సంతోషాన్ని నింపిందని తెలిపారు. అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 15న రెండో సమావేశం నిర్వహించి చదువు చెప్పిన గురువులను సన్మానించాలని నిర్ణయించారు. తమతో పాటు చదువుకున్న వారందరినీ ఆ రోజు సమావేశంకు తీసుకురావాలని తీర్మానించారు. పూర్వ విద్యార్థులు చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో కే.బిక్షపతి చారి, కొండి శ్రీనివాస్, కొండ శ్రీకాంత్, శ్రీనివాస్ గుప్తా, హరిలాల్, సోలేటి రమేష్, టి. రవి, వీరేష్, కృపాచారి, సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ, పుణ్య, జీవన్, లక్ష్మణ్, ప్రభాకర్, యాదగిరి, విష్ణు, వసుంధర, శ్రీలత, ప్రసన్నకుమారి, ఉమా, స్వతంత్ర తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now