సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే వేగవంతం చేయాలి,

సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే వేగవంతం చేయాలి,

వరి కొనుగోళ్లను పర్యవేక్షించాలి.

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.

గ్రామాల్లో మున్సిపాలిటీలలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం కలెక్టర్ బాదావత్ సంతోష్ వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లు, సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేపై ఆర్డివోలు, తాహసిల్దార్లు, ఎంపీడీవోలతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ

నాగర్ కర్నూల్ జిల్లాలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటిదాకా ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారని సివిల్ సప్లై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలలో అవసరమైనన్ని టార్పాలిను, ప్యాడి క్లీనర్స్ ,డిజిటల్ మెకో మీటరు, తదితర అవసరాలపై చర్చించారు.మండల స్థాయిలో తాహసిల్దార్లు, ఎంపీడీవోలు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలను సందర్శించి, వరి కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా జిల్లాలో కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. జిల్లాలోని గ్రామస్థాయిలో మండలాల వారీగా సామాజిక సర్వే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు.సర్వే సమగ్ర వివరాల డాటా ఎంట్రీనీ ఆపరేటర్ల తో డాటా ఎంట్రీ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సూచించారు.

డేటా ఎంట్రీ కోసం

అవసరమైనన్ని కంప్యూటర్లు ఉన్నాయా,డాటా ఎంట్రీ ఏన్యూమరేటర్ సమక్షంలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా జరగాలని, తెలియజేశారు.సర్వే పూర్తి వివరాలపై డీపీఓ నివేదికను కోరారు. సర్వే పూర్తిచేసిన ఫారాల భద్రత స్టోరేజ్ పై ఎంపీడీవో, కమిషనర్ లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ కే సీతారామారావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవ సహాయం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment