ఎమ్మెల్యే ఇంట్లో కుటుంబ సమగ్ర సర్వే
ప్రశ్న ఆయుధం న్యూస్, నవంబర్ 21, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లా సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ప్రముఖుల వివరాల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ వేణు గోపాల్, ఎన్యుమరేటర్, తదితరులు పాల్గొన్నారు.