చెరువులో చేపలు పట్టి విషయంలో రెండు గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ

*చెరువులో చేపలు పట్టి విషయంలో రెండు గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ*

*ఇల్లందకుంట మే 19 ప్రశ్న ఆయుధం*

IMG 20250519 WA1768

రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని మల్యాల గ్రామపంచాయతీ ప్రజలు వాగోడ్డు రామన్న పల్లె గ్రామపంచాయతీ ముదిరాజు కులస్తుల మధ్య మల్యాల చెరువు విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు మల్యాల గ్రామంలోని చింతల చెరువులో చేపలు పట్టే అధికారం మాదంటే మాది అని మల్యాల, వాగొడ్డు రామన్నపల్లి ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే

మల్యాల గ్రామ పంచాయతీ నుంచి నూతనంగా వాగొడ్డు రామన్నపల్లి గ్రామ పంచాయతీ గా ఏర్పాటు చెందినప్పటి నుంచి చెరువు వివాదం కొనసాగుతుందని ఆయా గ్రామస్తులు తెలిపారు.మల్యాల లో ముదిరాజ్ కులస్థులు లేకపోవడం వాగొడ్డు రామన్నపల్లి లో ముదిరాజ్ కులస్థులు ఉండటం తో చెరువు మా కులస్థులకే చెందుతుందని రామన్నపల్లి గ్రామస్తులు వాదిస్తున్నారు.కోర్ట్ తీర్పు మాకే అనుకూలం గా ఉందని చెరువు పై సర్వహక్కులు ముదిరాజ్ కులస్తులకే చెందుతుందని రామన్నపల్లి గ్రామస్తులు తెలిపారు. మల్యాల గ్రామస్థులు మాట్లాడుతూ మా ఊరు కు చెందిన చెరువు మాకే చెందుతుందని వేరే గ్రామానికి ఏం సంబంధం అని మల్యాల గ్రామస్థులు తెలిపారు. ముదిరాజ్ కులస్తులు చింతల చెరువులో చేపలు పట్టాలంటే గ్రామ పంచాయితీ అభివృద్ధి కోసం డబ్బులు ఇవ్వాలని ప్రజలు డిమాండు చేశారు .

Join WhatsApp

Join Now