పేదవాడి భూమిపై ఓ కాంట్రాక్టర్ డేగ కన్ను..!

పేదవాడి భూమిపై ఓ కాంట్రాక్టర్ డేగ కన్ను..!

కొయ్య గుట్టలో భూ ఆక్రమణకు యత్నం

అధికారుల చేతివాటం

పూర్తిస్థాయిలో విచారణ చేపడితే అసలు వాస్తవాలు బహిర్గతం

కాంట్రాక్టులో సైతం అవినీతికి పాల్పడ్డ ఈ నాయకుడు…

ప్రశ్న ఆయుధం 14 అక్టోబర్ ( బాన్సువాడ ప్రతినిధి )

ఈ నాయకుని కన్ను భూమిపై పడితే దాన్ని కబ్జా చేసే వరకు విడిచిపెట్టాడు.ఇతను కాంట్రాక్టర్ అవతారం ఎత్తి ఎన్నో అక్రమాలకు పాల్పడగా నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ లో సైతం డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాల్లో అనేక అక్రమాలకు పాల్పడి అప్పట్లో ఈ సంఘటన చర్చనియాంశంగా మారి ఎన్నో విమర్శలకు గురయ్యాడు తాజాగా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని కోయగుట్ట సమీపంలో ఆటోనగర్ పక్కన ఏకంగా సుమారు రెండు ఎకరాలు 15 గుంటలు కబ్జాకు పాల్పడడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని కోయగుట్ట ఆటోనగర్ పక్కనగల భూమిపై ఓ రాజకీయ నాయకుడు కన్నేశాడు. షేక్ మొహమ్మద్ అనే వ్యక్తి కి 2 ఎకరాల 15 గుంటలు భూమి ఉండగా. అందులో నుండి ఆటోనగర్ కాలనీ ఏర్పాటు కొరకు 20 గుంటల భూమిని ప్రభుత్వానికి ఇవ్వడంతో ప్రభుత్వం నుండి 9 లక్షలు 20 వేల రూపాయలు తమకు ఇచ్చారని వారు అన్నారు.మిగతా ఒక ఎకరం 35 గుంటల భూమి. షేక్ మొహమ్మద్ పేరిట పట్టా పాస్ బుక్ తమ పేరిట ఉన్నాయని తెలియజేశారు.కాగా ఇట్టి భూమిని కొయ్యగుట్ట కాలానికి చెందిన ఓ కాంట్రాక్టర్ ఓరాజకీయ నాయకుడుఈ భూమిపై కన్నేసి ఆ భూమిని ఆక్రమించుకునేందుకు భూమి నాదని పూర్తి పత్రాలు నా దగ్గర కూడా ఉన్నాయంటూ బెదిరింపులకు దౌర్జన్యాలకు పాల్పడుతూ అవసరమైతే ఎలాంటి దాడులకైనా వెనుకంజ వేయబోనని ఆయన బెదిరింపులకు గురి చేస్తున్నాడనీ ఆరోపించారు.నకిలీ పత్రాలు తయారు చేసుకుని.ఈ ఇట్టి భూమి నాదేనని అంటున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బాధితుడు ఆయా శాఖల అధికారులకు తన గోడును వినిపించుకున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. ఇప్పటివరకు ఆ భూమి వైపు ఏ అధికారి కూడా ఆ భూమి వైపు కన్నెత్తి చూడకపోవడం విడ్డూరం. మాభూమి మాకు ఇప్పించండి అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడితే అసలు వాస్తవాలు బహిర్గతం అవుతాయని బాధితులకు న్యాయం జరుగుతుందని స్థానికులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment