*పాఠశాలల జంటీకరణ (ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్)*
*హుజురాబాద్ ఏప్రిల్ 17 ప్రశ్న ఆయుధం*
జిల్లా విద్యాధికారి ఆదేశాల మేర గురువారం రోజున మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబంధిత ఉపాధ్యాయులు హుజురాబాద్ మండలంలోని ఇప్పలనర్సింగపూర్ కాట్రపల్లి ఇందిరానగర్ ప్రాథమికొన్నత పాఠశాల విద్యార్థులు కందుగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి రంగాపూర్ పోతిరెడ్దిపేట ప్రాథమికొన్నత పాఠశాల విద్యార్థులు హుజురాబాద్ లోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కి చేర్చి వైవిద్య వాతావరణంలో పెద్ద పిల్లలతో కలిసి ఇంకొన్ని నేర్చుకొనేలా పరిస్థితులలను కల్పించారు పల్లె ప్రకృతి వనం, ఏ ఐ, జన్యా, సైన్స్ లాబ్స్, కిచెన్ గార్డెన్ లను పరిశీలన చేయించారు ఎవరికి వారు వారి పాఠశాలలో నేర్చుకున్న నృత్యం, సూక్తులు, ఆటలు, పాటలు అందరి ముందు ప్రదర్శించి వారంతా ఒకరితో ఒకరు ఆనందాన్ని పాలుపంచుకున్నారు