స్వగ్రామానికి మృతి దేహం 

స్వగ్రామానికి మృతి దేహం

నిజామాబాద్ జిల్లా

ఆర్మూర్ మండలంలోని

రాంపూర్ గ్రామానికి చెందిన గంట చిన్న ముత్తన్న(56) బతుకు దెరువు కోసం కొంత కాలం క్రితం గల్ఫ్ దేశం కతార్ వెళ్లాడు. అక్కడ అరబ్బుల ఇంట్లో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. యజమానితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రెండు రోజుల పాటు తన స్నేహితుల దగ్గర ఉన్నాడు. తిరిగి తన యజమాని దగ్గరకు వెళ్తున్నానని స్నేహితులతో చెప్పి అక్కడి నుంచి బయలు దేరాడు. యజమాని దగ్గరకు వెళ్లకుండి నవంబర్ 13న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన యజమాని అప్పటికే ఐడి కార్డు బ్లాక్ చేయడంతో మృతదేహం ఇండియాకు తీసుకురావడానికి 6000 రియల్(లక్షా యాభైవేలు) ఖర్చు అవుతుందని కతర్ అధికారులు తెలపడంతో ముత్తన్న స్నేహితులు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధును కలిసి విషయాన్ని తెలిపారు. ఆయన ఈ విషయాన్ని ఐసిబిఎప్ కార్యవర్గ సభ్యుల సహకారంతో ఎంబసి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మృతదేహాన్ని ఐసిడబ్ల్యూఎఫ్ ఫండ్ మృతదేహాన్నిఇండియాకు ముత్తన్న పంపించారు.హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్వగ్రామం వరకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. గత వారం రోజుల నుంచి నిరంతరం కష్టపడ్డ తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధు, ఐ సి బి ఎఫ్ సెక్రెటరీ మహమ్మద్, శంకర్ గౌడ్, ఇండియా ఎంబాసి అధికారులకు ప్రవాసి సంక్షేమ సమితి అధ్యక్షుడు కోటపాటి నరసింహ నాయుడు ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment