*చెడు వ్యసనాలకు బానిసై గంజాయి అమ్ముతున్న డిప్లొమా విద్యార్థి అరెస్ట్*
*కేజీ 300 గ్రాముల గంజాయి,సెల్ ఫోన్,2000రూ.. నగదు స్వాధీనం*
*వివరాలు వెల్లడించిన డిఎస్పి రాజశేఖర్ రాజు*
ప్రశ్న ఆయుధం ,మిర్యాలగూడ డిసెంబర్ 19:
చెడు వ్యసనాలకు బానిసై మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న నిందితుని అరెస్ట్ చేసిన మిర్యాలగూడ పోలీసులు.తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా తీసుకోన్న మాదకద్రవ్యాల నిర్మూలనవ భాగంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా గంజాయి అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపి నిరంతరం నిఘాలో మిర్యాలగూడ పట్టణంలో గురువారం నాడు ఉదయం 8:00 గంటల సమయంలో బోటింగ్, శివాలయం ప్రాంతంలో గంజాయి అమ్ముతున్నాడు అనే సమాచారం మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎంక్వయిరీ చేస్తున్న క్రమంలో పెట్రోలింగ్ వాహనాన్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు.
![చెడు వ్యసనాలకు బానిసై గంజాయి అమ్ముతున్న డిప్లొమా విద్యార్థి అరెస్ట్ 1 IMG 20241219 WA0140](https://prashnaayudham.com/wp-content/uploads/2024/12/IMG-20241219-WA0140.jpg)
వివరాలు: సిరికొండ భాను ప్రకాష్ (21) డిప్లమా త్రిబుల్ ఈ విద్యార్థి గ్రామం అమ్మినాబాద్ అనంతగిరి మండలం సూర్యాపేట జిల్లా. చెడు వ్యసనాలకు బానిసై కాలేజీ ఫ్రెండ్స్ తో కలిసి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లోని కూర్మనూర్ గ్రామంలో ఓ వ్యక్తి వద్ద నుండి 500 గ్రాముల గంజాయి ఐదువేల కు కొనుగోలు చేసి హైదరాబాదులోని వివిధ కాలేజీలోని విద్యార్థులకు, మిర్యాలగూడలోని కొంతమంది వ్యక్తులకు చిన్న చిన్న ప్యాకెట్లుగా ప్యాకింగ్ చేసి ఒక్కో ప్యాకెట్ ను 1000 రూపాయల నుండి 5000 రూపాయలకు అమ్ముతూ తక్కువ సమయంలో కష్టపడకుండా ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో భద్రాచలం చింతూరు కుంట గ్రామం నుండి గంజాయి తీసుకువచ్చి 19 తారీకు మిర్యాలగూడకు చెందిన నలుగురు వ్యక్తులకు అమ్మి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్దాం అనే క్రమంలో తడకమళ్ళ ఎక్స్ రోడ్డు వద్ద నిందితుని పట్టుబడి చేసి క్రైమ్ నెంబర్ 330/2024 కేసు నమోదు చేయడం జరిగింది.1300 గ్రాముల గంజాయి 2000 రూపాయలు నగదు, సెల్ ఫోన్ నిందితుడి నుండి స్వాధీనపర్చుకోనైనది. ఇట్టి కేసుతో సంబంధం ఉన్న నిందితులను విచారణ అనంతరం వారిని కూడా పట్టుబడి చేసి కోర్టు ముందు హాజరు పరచడం జరుగుతుందని డీఎస్పీ కే.రాజశేఖర్ రాజు వివరాలు తెలిపారు.అనంతరం ఈ కేసును చేదించిన మిర్యాలగూడ వన్ టౌన్ సిఐ కరుణాకర్ ఎస్సై సుధీర్ కుమార్ కానిస్టేబుల్ చందా వెంకటేశ్వర్లు హుస్సేన్ శీను ఎస్.కె తముజుద్దీన్ వీరబాబు నర్సింహాలను మిర్యాలగూడ డిఎస్పి అభినందించారు.టూ టౌన్ సిఐ నాగార్జున వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది డీఎస్పీ వెంట ఉన్నారు.
Post Views: 16