చిన్నారులకు వివిధ రకాల ఆట వస్తువుల పంపిణీ కార్యక్రమం 

చిన్నారులకు వివిధ రకాల ఆట వస్తువుల పంపిణీ కార్యక్రమం

 

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 8

 

మంగళవారం రోజునకామారెడ్డి మున్సిపల్ పరిధి 22 వార్డులో గల గవర్నమెంట్ ప్రైమరీ పాఠశాల డ్రైవర్స్, కాలనీ నందు 22 వార్డ్ ఇంచార్జ్ అబ్దుల్ సిద్ధిఖ్, పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు అందరికీ వివిధ రకాల ఆట వస్తువులు పంపిణీ చేసినారు. మరియు చిన్నారుల తల్లిదండ్రులకు సమావేశం నిర్వహించినారు. ఇట్టి సమావేశంలో చిన్నారులకు తల్లిదండ్రులకు తన అమూల్యమైన సూచనలు చేసినారు. వర్షాకాలంలో పాఠశాల పరిసర ప్రాంతాలలో జాగ్రత్త ఉండాలని, విష జంతువులు తిరుగుతాయి. కావున జాగ్రత్త ఉండాలని ఇట్టి విషయాలను తల్లిదండ్రులను తమ పిల్లలకు చెప్పాలని సూచించారు. అదే విధంగా ఆట వస్తువులు, పంపిణీకి చేస్తూ ఆటలు ద్వారా పిల్లలు మనసికంగా శరీరకంగా ఎదుగుతారని ప్రతి విద్యార్థి చదువులో పోటీగా ఆటలు ఆడాలని కోరారు ఇటీ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now