అసలు ఆమె ఎలా మరణించింది?
కడుపు నొప్పితో ఆస్పత్రికి వస్తే, కత్తితో కోసి పండబెట్టారు..
ఆస్పత్రికి వచ్చిన, ఆరు రోజుల నుంచి ఆమెను పట్టించుకున్న వారే కరువయ్యారు.
వైద్యుని నిర్లక్ష్యంతో ప్రాణం బలి.
ఆస్పత్రి వద్ద ఆ గ్రామస్తుల ఆందోళన.


ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని హాజీపూర్ తాండ గ్రామానికి చెందిన కాట్రోత్ కేస్లీ కడుపునొప్పి బాధ భరించలేక ఎల్లారెడ్డి పట్టణంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వైద్యం నిమిత్తం రాగా ఆసుపత్రి వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించగా, కుటుంబీకులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కేస్లీ భాయ్ కు, ఆపరేషన్ చేయమని కోరగా, ఆపరేషన్ చేసినప్పటి నుంచి నేటి వరకు ఆమె గదిలోనికి వైద్యులు వెళ్లకపోవడం ఆపరేషన్ చేస్తుండగానే,మృతి చెందిందా లేక ఆమె,ప్రత్యేక వార్డు కు మార్చగానే,మృతి చెందిదా,అని అనుమానం తో కుటుంబీకులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆమె ఎలా మరణించింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఈనెల 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు కాట్రో,తో కేస్లీ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరింది. కడుపునొప్పి తో బాధపడుతుందని వైద్యులు పరీక్షలు నిర్వహించగా, కడుపులో కంతి, అయిందని ఆమెకు తప్పకుండా ఆపరేషన్ చేయాలని వైద్యుల సూచన మేరకే ఆపరేషన్ నిర్వహించారు. ఆరు రోజుల నుండి ఆమెను పట్టించుకోకపోవడంతో ఎప్పుడు మృతి చెందిందో వాళ్ళకి తెలియదని కుటుంబ సభ్యులు తెలపడంతో ఆసుపత్రి వద్ద గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఆసుపత్రి పై దాడులకు ప్రయత్నించారు. దాంతో ఆసుపత్రి వద్దకు పోలీసులు చేరుకొని కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. మృతి చెందిన కేస్లీ భాయ్ కి ఇద్దరు కుమారులు రతన్ మోతిరామ్ ఉన్నట్లు గ్రామస్తులు తెలిపిన సమాచారం. ఆస్పత్రి వద్ద వైద్యులపై చర్యలు చేపట్టాలని ఆ గ్రామస్తులు మొండికి దిగారు..