ఇల్లు, ఇంటి స్థలం కోల్పోయిన బాధితులకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి ఆదుకోవాలి

*ఇల్లు, ఇంటి స్థలం కోల్పోయిన బాధితులకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి ఆదుకోవాలి*

భద్రాచలం:15.డిసెంబర్.2024

భద్రాచలం గ్రామపంచాయతీ కి ఇంటి పన్ను చెల్లిస్తు సొంత ఇల్లు కోల్పోయిన మాకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వండి అంటూ ఆదివారం

స్థానిక రాజీవ్ నగర్ వాసులు డబుల్ బెడ్రూం ఇండ్ల ముందు వంట వార్పు కార్యక్రమం చేస్తు మా ఇల్లు మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్నీ వేడుకున్నారు. భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం వెనుక రాజీవ్ కాలనీ,(మనుబోతుల చెరువు) ప్రాంతంలో గత ఇరవై సంవత్సరాల నుంచి నివసిస్తున్న 16 కుటుంబాల ఇల్లు, ఇంటి స్థలాన్ని ప్రభుత్వ అధికారులు బలవంతంగా ఖాళీ చేయించి డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించడం జరిగిందని నిర్మాణం జరిగిన తర్వాత మీ అందరికీ ఈ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని అప్పటి తహశీల్దార్ శ్రీనివాస్ హామి ఇచ్చారని, కానీ ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాకు కాకుండా ఇతరులకు ఈ డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించి మాకు నిలువ నిడలేకు చేశారని బాధితులు ఆవేద వ్యక్తం చేశారు. ఇల్లు, ఇంటి స్థలం కోల్పోయిన బాధితుల మైన మాకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని నిరుపేదలమైన మా కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఇల్లు కోల్పోయిన మేము అనేక సంవత్సరాలుగా అద్దెలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. మేము అనేకసార్లు ప్రభుత్వ కార్యాలయాలలో దరఖాస్తులు చేసుకున్నమని, ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు అనేకసార్లు మాకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని హామీలు ఇచ్చి మోసం చేశారని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రజా ప్రభుత్వ నాయకులు స్పందించి మాకు ఇస్తానన్న డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని లేనిపక్షంలో ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థలం ఇల్లు కోల్పోయిన బాధితులు బంటు రామకృష్ణ, తోట కళావతి, ఎస్ కే ఇమాంబి, షేక్ అలీమా, బాసిపోయిన సావిత్రి, తిరువీధుల లక్ష్మి, కొత్తపల్లి సావిత్రి, గొల్ల వెంకటలక్ష్మి, వెట్టి చిలకమ్మా, గోల వీరమ్మ, గంజి గంగమ్మ, ఎల్లబోయిన నాగమణి, ఆనంగి రమణ, రాణి, సామాజిక ప్రజా ఉద్యమ నాయకులు అలవాల రాజా పెరియార్ మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత, మాదిగ మహిళా సమైఖ్య జిల్లా ఉపాధ్యక్షురాలు కొప్పుల నాగమణి, గంజి శ్రీను, గోల లక్ష్మణరావు, శంకర్, చిట్టెమ్మ, శంకర్ తదితర స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now