నేషనల్ పోలీస్ మీట్ కు ఎంపికైన ఆకుల స్వప్న

*నేషనల్ పోలీస్ మీట్ కు ఎంపికైన ఆకుల స్వప్న*

*జమ్మికుంట ఏప్రిల్ 13 ప్రశ్న ఆయుధం*

కేరళలోని కొచ్చి పట్టణంలో జరుగుతున్న ఆల్ ఇండియా పోలీస్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ కు జమ్మికుంట పట్టణం మోత్కుల గూడానికి చెందిన ఆకుల స్వప్న ఎంపికైంది ఈనెల 11 నుండి 15 వరకు జరుగుతున్న ఈ పోటీలలో టేబుల్ టెన్నిస్ విభాగంలో తెలంగాణ రాష్ట్రం తరఫున వెళ్తున్న క్రీడాబృంద సభ్యురాలిగా పాల్గొంటున్నది కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మహిళా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఆకుల స్వప్న గతంలో రాష్ట్రస్థాయిలో జరిగిన పోలీస్ క్రీడల్లో పథకాలు సాధించి జాతీయ పోటీలకు ఎంపికైంది ఆకుల స్వప్న ఎంపిక పట్ల పలువురు మోత్కూలగూడెం గ్రామస్తులు క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment