ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది….కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు క్షేత్ర పరిశీలన, జాబితా తయారీ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. 

శనివారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతు భరోసా కార్యక్రమం క్రింద ఈ నెల 15 నాటికి సన్నాహక ఏర్పాట్లు పూర్తిచేయాలని అన్నారు. గుట్టలు, రోడ్లు, నలా కన్వర్షన్, భూసేకరణ, లే అవుట్, వ్యవసాయానికి యోగ్యంగా లేని భూములన పరిశీలించాలని తెలిపారు. ఈ నెల 16 నుండి 20 వరకు క్షేత్ర పర్యటన చేసి డేటా సిద్ధం చేయాలని తెలిపారు. గ్రామ సభలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. భూమిలేని వ్యవసాయ కూలీలు కనీసం 20 రోజుల పాటు ఉపాధి హామీ పథకం క్రింద పనిచేసిన డేటా ను సిద్ధం చేయాలనీ తెలిపారు. ఆధార్ నెంబర్ మ్యాపింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామ సభలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారు, గతంలో రేషన్ కార్డుల కొరకై దరఖాస్తు చేసుకున్న వారి డేటా ను సిద్ధం చేయాలనీ తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని తెలిపారు. తుది నిర్ణయం గ్రామ, వార్డు సభలో చర్చించడం జరుగుతుందని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల సర్వే రేపటి లోగా పూర్తి చేయాలనీ కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ఎంపీడీఓ లు, మున్సిపల్ కమీషనర్ లు 5% సూపర్ చెక్ చేయాలని అన్నారు. ప్రతీ నియోజక వర్గానికి 3500 ఇళ్లు కేటాయించడం జరుగుతుందని,

ఈ టెలీ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, D శ్రీనివాస్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీఓ లు రంగనాథ్ రావు, ప్రభాకర్, పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment