శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఒక నెల వేతనం వీరాలంగా ఇచ్చిన కుటుంబం
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ గ్రామం వద్దగల
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి తమ వంతు సహాయంగా సిరిసిల్ల జిల్లా, గంభరావుపేట మండలం, నర్మాల గ్రామానికి చెందిన పురం తిరుపతిరావు – కవిత నర్మాల వాస్తవ్యులు తమ కుమారుడి మొదటి నెల వేతనం Rs.51016/-(యాబై ఒక వేల పదహారు రూపాయలు )విరాళంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కి అందజేశారు, అనంతరం ఆలయ సిబ్బంది దాతలను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీధర్ రావు, ఆలయ అర్చకులు, జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.