వేధింపులు తట్టుకోలేక కొడుకును నరికి చంపిన తండ్రి

రోజు మద్యం గంజాయి తాగి తల్లిదండ్రులను వేధిస్తున్న కొడుకు…వేధింపులు తట్టుకోలేక కొడుకును నరికి చంపిన తండ్రి

తూప్రాన్ సిఐ రంగా కృష్ణ

వెల్దుర్తి మండలం జనవరి17

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్ గ్రామానికి చెందిన మాదాసు దుర్గయ్య వృత్తి టైలర్ బట్టలు కొడుతూ జీవనం సాగిస్తున్నాడు. తనకు ఇద్దరు కుమారులు రెండవ కొడుకు మాదాసు శ్రీకాంత్ 29 రోజు తాగి వచ్చి తల్లిదండ్రులను వేధిస్తున్నాడని, రోజు జులాయి గా తిరిగి వచ్చి మద్యం, గంజాయి త్రాగుతూ ఉండేవాడని తల్లిదండ్రులు మందలిస్తే మిమ్మల్ని చంపుతానని అనే వాడని, నిన్న సాయంత్రం 4 గంటల నుండి రాత్రి వరకు తండ్రి తో గొడవ పడ్డాడని, ప్రతీ సారి తల్లిదండ్రులను డబ్బులు ఇవ్వమని గొడవ పడేవాడని వారు ఇచ్చే డబ్బులతో జల్సాలు చేస్తూ జులయిగా తిరిగే వాడని స్థానికులు చెబుతున్నారు. ఈ విధంగా సుమారు 5 సంవత్సరాలుగా కుటుంబాన్ని వేధిస్తున్నాడని తెలిపారు. త్రాగి వచ్చి తన అన్న మాదాసు నవీన్ తో కూడా గొడవ పడుతూ కొట్టే వాడని అంటున్నారు. అన్నకు పెళ్లి సంబంధం చూస్తే పెళ్లి చేసుకోవద్దని బెదిరించే వాడని, నేను చేసుకొని నువ్వు కూడా పెళ్లి చూసుకోవద్దని గొడవ పడే వాడని తెలిపారు. నిన్న రాత్రి గురువారం డబ్బులు ఇవ్వమని గొడవ పడ్డాడని తెలిపారు. ఇటీవలే 10వేలు ఇచ్చారని మళ్ళీ 5 వేలు ఇవ్వాలని వేదించడంతో విసుగు చెందిన తండ్రీ మాదాసు దుర్గయ్య తన కొడుకు మాదాసు శ్రీకాంత్ 29 ను నిన్న రాత్రి 12 గంటల సమయంలో నిద్ర పోతుండగా కత్తి తో నరికి చంపి హతమార్చాడు.అనంతరం తండ్రి పోలీసులకులొంగిపోయారు

పోలీసులకు ఈ విషయం తెలిపారు అంతకున్ని రిమాండ్ చేసి ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తూప్రాన్ సీఐ రంగకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో మనోరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

Join WhatsApp

Join Now