Headlines
-
ఓ తండ్రి ఆవేదన
-
చిన్నప్పుడు తప్పటగులు
-
తల్లి యొక్క ఆవేదన
-
స్త్రీలకు సమాజంలో గౌరవం
-
ఆడజన్మ యొక్క ప్రాధాన్యత
-
భర్త మరియు భార్య మధ్య ప్రేమ
-
సంవర్ధన మరియు గౌరవం
-
తల్లి, బిడ్డల భవిష్యత్తు
*_చిన్నప్పుడు తప్పటగులు వేస్తె రెండు చెంపదేబ్బాలేసి అలాంటి తప్పు మళ్ళీ చేయకూడదని భయం ఉంచేవాడిని._*
*_ఇప్పుడు నీవు ‘అమ్మ’ గా పరిపూర్ణ ‘స్త్రీ మూర్తి ‘వయ్యావు బిడ్డలకు తల్లి గా ఉండి నీ బిడ్డలకు మంచి, చెడు యొక్క విచక్షణాజ్ఞానాన్ని తెలియజేసే ఒక గొప్ప ‘అమ్మ ‘ స్థానములో ఉన్నావు.._*
*_అందుకే నా మాటలను రాతలుగా నీకు తెలియజేస్తున్నాను..ఎందుకంటే, చదువుకున్న దానివి, సమస్కారవంతురాలివ ని నమ్ముతూ..ఓ తండ్రిగా నా ఆవేదన తెలియజేస్తున్నాను.._*
*_స్త్రీలు ఎప్పుడూ ఒకరి సంరక్షణలో ఉండాలే తప్ప, ఒంటరిగా ఎన్నడూ ఉండకూడదు..ఈ లోకమంతా రాబందులతో, అవకాశా వాదులతో నిండి ఉంది తల్లి.తప్పుడు నిర్ణయాలతో తప్పడగులు వేయకు.. అ తప్పటడుగులు నీ జీవితాగామనాన్ని అతలాకుతలం చేస్తాయి…_*
*_అందుకే మన పెద్దలు కుటుంబ వ్యయస్థను ఏర్పాటు చేశారు.._*
*_పెళ్లయ్యే వరకు తండ్రి సంరక్షణలో…_*
*_పెళ్లయ్యాక మొగుడి సంరక్షణలో…_*
*_ముసలితనములో కొడుకు సంరక్షణలో…స్త్రీలు సురక్షతంగా ఉంటారు._*
*_చిన్నతనంలో తండ్రి, పెద్దయ్యాక భర్త, పెద్దతనంలో కొడుకు స్త్రీకి రక్షణగా నిలవాలని ఆ సురక్షిత వ్యవస్థను అతిక్రమించి స్త్రీ స్వతంత్రంగా వ్యవహరించడం తగదని వేల సంవత్సరాల కిందట మన ధర్మం చెప్పిన హితవు._*
*_భర్తలేని స్త్రీ కి, తండ్రి లేని ఆడపిల్లకి సమాజంలో గౌరవ మర్యాదలు ఉండవు తల్లి. పైగా ఎప్పుడు లోబర్చుకుందామా! అంటూ అవకాశం కొరకు రబంధువులగా కామంతో కళ్ళు గప్పినమానవ మృగాలు ఈ సమాజంలో జీవితాలతో ఆడుకోవడానికి సిద్ధంగా ఉంటారు జాగ్రత్త తల్లి._*
*_నీ నడక,నీ ఆలోచన విధానం అతి ఉన్నతంగా,అతి శ్రేష్టంగా ఉండాలే తప్ప..నవ్వుల పాలు అయ్యే విధంగా ఉండకూడదు తల్లి._*
*_కార్యేషు దాసి,_*
*_కరణేషు మంత్రి,_*
*_భోజ్యేషు మాతా,_*
*_రూపేచ లక్ష్మీ,_*
*_శయనేషు రంభ,_*
*_క్షమయా ధరిత్రీ._*
*_అంటే దీని అర్థం. పని లో దాసి గా, సలహా ఇవ్వడంలో మంత్రి గా,భోజనం పెట్టడంలో తల్లి గా అందం లో లక్ష్మి గా,పడక గదిలో రంభగా, క్షమించడంలో భూమాతగా ఆడది ఉండాలి అని మనం మన ధర్మం బోధించింది._*
*_కరణేషు మంత్రి: అంటే ఆడవాళ్ళకు తెలివి చాలా ఎక్కువ, వాళ్ళు ఇచ్చే సలహాలు పాటించాలి అని అర్థం. అలాంటిది నువ్వెందుకు అమ్మ తప్పుటడుగులు వేస్తున్నావు…?_*
*_తప్పటలుగులు నీ భర్త వేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత, నీ సంసారాన్ని సక్కదిద్దుకోవలసిన బాధ్యత కూడా నీదే తల్లి. అలాంటి ఉన్నతమైన స్థానంలో నీవు ఉన్నావు అది గుర్తుపెట్టుకో…_*
*_ఆడజన్మ అపురూపమైనది, అతి ఉకృష్టమైనది, అతి శ్రేష్టమైనది. ఆడది అంటేనే ఆదిపరాశక్తి. అంతటి ఉన్నతమైనటువంటి జన్మ నెత్తినవు తల్లి నువ్వు.._*
*_స్త్రీ అంటేనే మహా శక్తిశాలి. భూమాతకు ఉన్నంత ఓర్పు స్త్రీకి ఉంది కాబట్టే స్త్రీని మాతృమూర్తి అని గౌరవాన్ని ప్రత్యేక స్థానాన్ని కల్పించారు .ఈ సమాజంలో…_*
*_నీ కుటుంబానికి నీవేనమ్మ రాణివి. మంచి చేసిన,చెడు చేసిన ఏది చేసినా నీ పైనే అది ప్రభావం చూపిస్తుంది. అందుకే మంచే చేసే ప్రయత్నం చెయ్యి తల్లి._*
*_మన ఋషులు, మునులు దాంపత్య జీవితాన్ని,వివాహ వ్యవస్థను కల్పించారు. అందుకే మన ధర్మం లో…_*
*_’స్త్రీ’లేని చోట జరిగే దేవత పూజాదిక్రియలన్నీ వ్యర్థం అంటే స్త్రీలకు మన ధర్మం అంత ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే స్త్రీని మాతృమూర్తి అన్నారు._*
*_మగవాడు బలహీనుడు._*
*_చిన్నతనములో తల్లి యొక్క సంరక్షణలో, ప్రేమలో బ్రతుకుతాడు._*
*_యుక్త వయస్సు వచ్చాక భార్య ప్రేమలో పర్వశించిపోతాడు._*
*_అంటే, నాకు తెలిసి ప్రతి మగాడు తల్లి తరువాత తన భార్యనే తన ధైర్యం, తన విజయం..తన జీవితం అని నమ్ముతాడు. అది నిజం కూడా.. ఇందులో ఎలాంటి సందేహం లేదు._*
*_అందుకే అన్నారు కదా! మన పెద్దలు. ఒక మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది, ఒక మగవాడి పతనం వెనుక కూడా ఒక స్త్రీనే ఉంటుంది అని.అది అక్షరాల నిజం కూడా.._*
*_నిజముగా నీ భర్త తప్పు చేసే విధంగా వారి ప్రవర్తన ఉంటే ముందుగా నిదానంగా నీ భర్తతో ఈ విషయాన్ని చర్చించాలి సర్దిద్దుకోవాలి. అది సాధ్యం కాని పక్షంలో…మీ అత్తమామలతో చర్చించి, సమస్యను పరిష్కరించే విధంగా నీ అడుగులుఉండాలి._*
*_ప్రతిదీ స్త్రీ యొక్క నడవడికపై అ కుటుంబ వాతావరణం ఆధారపడి ఉంటుంది.నీవు నీ భర్తను ఎంత లాలించి మురిపిస్తావో అంత పైకి తన రెట్టింపు శక్తిని కూడుకొట్టుకొని నీకోసం ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా సాధించగలుగుతాడు మగాడు.._*
*_నీవు ఎంత ద్వేషంతో రగిలిపోతావో.. మరలా అంత ద్వేషమే నీకు లభిస్తుంది. ఇద్దరి మధ్యలో వైశ్యమ్యాలు నెలకొంటాయి.అందుకే నీ భర్తకు ప్రేమను పంచు, ప్రేమతో పలకరించు అంతకంటే రెట్టింపు ప్రేమ నీకు లభిస్తుంది._*
*_నీవు ఎంతవరకు మానసికంగా హింసిస్తూ, చెప్పుడు మాటలతో..కక్ష సాధింపు చర్యకు పూనుకుంటావో.. అక్కడే మీ ఇరువురి జీవితం నరకప్రాయం అని తెలుసుకో.._*
*_’స్త్రీ ‘కి పతియే ప్రత్యక్ష దైవమమ్మ.._*
*_చెప్పుడు మాటలు విని తప్పటడుగులు వేయకు. అది నీ బంగారు సంసారాన్ని విచ్చినం చేస్తుంది._*
*_నీవు చేసే తప్పు, తప్పుడు నిర్ణయాలు రేపు నిన్ను ఒంటరినీచేయడమే కాకుండా, నీ బిడ్డలు తండ్రి లేని అనాధలుగా పెరుగుతారు.._*
*_ఎన్నాళ్ళు నీకు తోడుగా ఉంటాము మేము.. కలకాలం కడవరకు నీకు తోడుగా ఉండేది నీ భర్తనే అనే విషయాన్ని మర్చిపోకు తల్లి._*
*_నీ ప్రతి సమస్యలో తోడు నీడగా ఉండేది నీ భర్తనే నమ్మ నీ భర్త యొక్క విలువ పోతే నీ విలువ కూడా పోయినట్టే తల్లి._*
*_నీ భర్త యొక్క గౌరవాన్ని నీవు ఎంత పెంచుతావో… సంఘములో, సమాజంలో ఓ మంచి గృహిణిగా నీ గౌరవం అంత పెరుగుతుంది._*
*_నిన్ను చూసి ఓ తండ్రిగా నేను గర్వపడే విధంగా ఉండాలి కానీ, నీవల్ల తలదించుకునే విధంగా ఉండకూడదు అమ్మా!_*
*_పదిమంది పది రకాలుగా మాట్లాడే విధంగా నీ నడక ఉండకూడదమ్మా! పదిమంది నీ గురించి గొప్పగా చెప్పుకునే విధంగా ఉండాలమ్మా నీ నడక.._*
*_ఇప్పటికైనా మించి పోయింది ఏమి లేదు. నీ తప్పులు నువ్వు తెలుసుకొని, తల్లి లాంటి మీ అత్తమ్మ ను నీ భర్తను క్షమించమని వేడుకుని నీ సంసారాన్ని చక్కదిద్దుకో…_*
*_నేను చెప్పింది ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయు. చేతులారా నీవు నీ సంసారాన్ని నాశనంచేసుకోకు బిడ్డా!_*
*_మంచి మాటలు, సంస్కారాన్ని చెప్పేవారు లేక. చెప్పుడు మాటలతో నీభవిష్యత్ అంధకారంలో ఉంచబోకు.. ఎందుకంటే భవిష్యత్తు యొక్క అవగాహన నీకు లేదు.._*
*_ఇంతకంటే ఎక్కువ_*
*_ఓ.. తండ్రిగా నీకు నేను.. ఇంకాచెప్పలేను.._*
ఆలోచించి నిర్ణయం తీసుకో.. నేను చెప్పింది నిజం అనిపిస్తే, ఆచరించి నీ జీవితాన్ని సరిదిద్దుకో.అంతా నాకే తెలుసు అని నువ్వు భావిస్తే.. నిర్ణయం నీకే వదిలేస్తున్నానమ్మా.ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో తల్లి… ఏదైనా ప్రేమతోనే సాధ్యమవుతుందమ్మా. కోపంతో,ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు రేపు నీ బంగారు భవిష్యత్తును, నీ పిల్లల భవిష్యత్తును అంధకారంలో మాత్రం నెట్టేస్తుంది. జాగ్రత్త బిడ్డ!_-ఇక సెలవు…ఉంటాను…నా బంగారు తల్లి.._