అంత్యక్రియల దాక వెళ్లిన కార్యకర్తను బ్రతికించిన అభిమాన నేత పచ్చబొట్టు
వనపర్తి పట్టణంలోని పీర్లగుట్టలో ఘటన.. బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పై అభిమానంతో ఛాతీపై ఆయన పచ్చబొట్టు వేయించుకున్న తైలం రమేశ్ (49) అనే వ్యక్తి
అయితే వనపర్తి పీర్లగుట్టలోని బంధువుల ఇంటికి వచ్చి అల్పాహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురైన రమేశ్
తర్వాత ఎలాంటి చలనం లేకపోవడంతో అందరూ చనిపోయారని భావించి.. అందరిని పిలిచి అంత్యక్రియలకు సైతం ఏర్పాట్లు చేసిన కుటుంబసభ్యులను
ఈ విషయం బీఆర్ఎస్ నాయకుడు నిరంజన్ రెడ్డికి తెలిసి తన అభిమాన కార్యకర్త చివరిచూపు కోసం రాగా.. ఈ క్రమంలో రమేశ్ ఛాతిపై ఉన్న తన పచ్చబొట్టును చూస్తుండగా ఊపిరి పీల్చుకుంటున్నట్లు అనుమానం వచ్చి వెంటనే రమేశ్ పై ఉన్న పూలమాలలు తీయించిన నిరంజన్ రెడ్డి
అనంతరం పేరు పెట్టి పిలవగా కొద్దిగా కనురెప్పలు కదిలించడంతో ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించగా గంట తర్వాత కళ్లు తెరవడంతో ఆనందాశ్చర్యాలకు గురైన కుటుంబసభ్యులు, బంధువులు