మోటార్ సైకిల్ యజమానికి రూ.12,000 రూపాయల జరిమాన

మోటార్ సైకిల్ నడిపి వ్యక్తి మరణానికి కారణమైన నేరస్తునికి, మోటార్ సైకిల్ యజమానికి రూ.12,000 రూపాయల జరిమాన

* గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి

*గజ్వేల్ , జనవరి 17,

అతివేగంగా, అజాగ్రత్తగా మోటార్ సైకిల్ నడిపి ఒక వ్యక్తి మరణానికి కారణమైన నేరస్తునికి, మోటార్ సైకిల్ యజమానికి ఇరువురికి కలిసి రూ. 12 వేల రూపాయల జరిమానా విధించినట్లు గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఎస్ఐ వెల్లడించారు. పచ్చకురా నవీన్ అలియాస్ ఆకుల నవీన్(19) తండ్రి సుధాకర్, నివాసం నాచారం, మండలం వర్గల్, జంపాకట్టే రాజు(29) తండ్రి రాములు (మోటార్ సైకిల్ యజమాని), నివాసం వర్గల్ కు చెందిన నేరస్తులకు జరిమానా విధించినట్లు తెలిపారు. కేసు వివరాలను ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలియపరుస్తూ తేదీ: 07-07-2019 రోజున మంగని నరసయ్య నాచారం టెంపుల్లో స్వీపర్ పని ముగించుకొని ఇంటికి వెళ్ళుచుండగా పై నేరస్తుడు నవీన్ మోటార్ సైకిల్ ను అతివేగంగా అజాగ్రత్తగా నడిపి మంగలి నర్సయ్యకు టక్కర్ ఇవ్వగా బలమైన రక్త గాయాలైనాయని, గజ్వేల్ ఆసుపత్రిలో ప్రదమ చికిత్స చేసి తదుపరి చికిత్స గురించి రష్ హాస్పిటల్ హైదరాబాదులో అడ్మిట్ చేయగా చికిత్స పొందుతూ నరసయ్య చనిపోయారని కుమారుడు దరఖాస్తు ఇవ్వగా అప్పటి ఎస్సై కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించి పై ఇద్దరి నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ డిమాండ్ కు పంపించడం జరిగిందని పేర్కొన్నారు. కేసు పరిశోధన పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారని తెలిపారు. ఆరోజు నుండి ఈరోజు వరకు గజ్వేల్ అడిషనల్ జెఎఫ్సిఎం కోర్టులో కేసు విచారణ కొనసాగిందని, ఇరువురి వాదనలు విన్న గజ్వేల్ అడిషనల్ జెఎఫ్సిఎం మెజిస్ట్రేట్ ప్రియాంక పై నేరస్తులపై నేరం రుజువైనందున నవీన్ నేరస్తునికి 11 వేల రూపాయల జరిమానా, వాహన యజమాని రాజుకు వెయ్యి రూపాయల జరిమానా మొత్తం 12 వేల రూపాయల జరిమానా విధించారని తెలిపారు. నేరస్తులకు శిక్ష పడడంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ సుధా, కోర్టు కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, కోర్టు లైజనింగ్ శ్రీనివాస్ రెడ్డి నేరస్తునికి శిక్ష పడడంలో కీలక పాత్ర పోషించినట్లు ఎస్ఐ వివరించారు.

Join WhatsApp

Join Now