ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిపై పోస్టర్ల కలకలం.
నిజామాబాద్, జనవరి 15
ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిపై పోస్టర్లు వెలిసిన ఘటన ఆర్మూర్ నియోజకవర్గంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్‌లో బుధవారం ‘ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మా నియోజకవర్గానికి రావొద్దు’ అంటూ పోస్టర్లు అతికించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదంటూ పోస్టర్లలో వివరాలు పేర్కొంటూ ఏర్పాటు చేశారు. కాగా.. వీటిని బీజేపీ నాయకులు తొలగించారు.