అటవి అధికారిణికి వినతి పత్రం అందజేత
ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :
భారతీయ కిసాన్ సంగ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పైడి విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సమావేశం ఏర్పాటు చేసి, పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటేనని రైతు సమస్యలపై చర్చించారు. అనంతరం రుణమాఫీ, రైతు భరోసా పూర్తిస్థాయిలో అమలు చేయాలని, అడవి జంతువుల వలన జరిగే పంట నష్టానికి సంబంధించి అటవి అధికారిని భోగ నిఖితను కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నగేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబిర్ ఆనంద్ రావు, రాష్ట్ర సహకార కార్యదర్శి కొమిరెడ్డి పెద్ద అంజన్న, జోనల్ అధ్యక్షులు లొంక వెంకట్ రెడ్డి, జిల్లా సహ కార్యదర్శి రమణారెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.