*కూత వేటు దూరంలో గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థ (ITDA) ఉన్నా బాధిత గిరిజనుల గోడు వినిపించదా…!
*మా ప్రాణాలు కాపాడండి మహాప్రభో అంటున్న ఎస్టీ కాలనీ గిరిజనలు…*
*గిరిజనులు అంటే అంత చులకన…?
ఎందరు నాయకులు వచ్చిన అధికారులు మారిన మా ఎస్టీ కాలనీ గిరిజనులు బ్రతుకులు మారటం లేదు అని వాపోతున్న ఎస్టి కాలనీ గిరిజనులు…?*
*పేరుకే గిరిజన సంఘాలు గిరిజన గ్రామాల్లో సమస్యల పై ఏ నాయకుడు మా వైపు చూడరు…?
భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, జిల్లా ఆ పై స్థాయి అధికారులైన మా గిరిజనుల గోడు పట్టించుకోండి సారో.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీలో గల శ్రీరాంపురం ఎస్టీ కాలనీలో సరైన సమయానికి వైద్యం అందక నాలుగు నెలల బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సారపాక శ్రీరాంపురం ఎస్టి కాలనీలో నివాసం ఉంటున్న గిరిజనులు సోడే కుమారి w/o సోడే రాజు కుమారుడు వయసు నాలుగు నెలలు ఆరోగ్యం బాగాలేక మొన్న రాత్రి ఎటువంటి వాహన సదుపాయం లేక నిన్న ఉదయం బాబుని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లిన క్రమంలో చికిత్స అందించారు కానీ ఫలితం లేదు బాలుడు మృతి చెందాడు.
తల్లిదండ్రులు గిరిజన ప్రజలు వాహన సదుపాయం లేక సరైన రోడ్డు మార్గం లేక మా గ్రామానికి డాక్టర్ గాని ఆశా వర్కర్ కానీ అంగన్వాడీ టీచర్ కానీ మాకు మా పిల్లలకు సరైన సలహాలు సూచనలు అవగాహన కల్పించకపోవడం వలన బాబు మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీరాంపురం ఎస్టి గిరిజన ప్రజలు.
పలుమార్లు ఉన్నత అధికారులకు మా గ్రామంలో ఉన్న సమస్యల మీద దరఖాస్తులు ఇచ్చిన పట్టించుకున్న అధికారి లేడు మా గిరిజన ప్రాణాలు అంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాబు మృతి చెందిన తర్వాత ఆయన ఏ అధికారైన మా గ్రామం వైపు వస్తాడని ఆశగా ఎదురు చూశాను కానీ రెండో రోజు కలుస్తున్న గాని ఇంతవరకు ఏ అధికారి గానీ నాయకులు గానీ మాకు ఫోన్ ద్వారా గాని మా గ్రామాన్ని పర్యటించిన దాఖలాలు లేవు అని గిరిజన బిడ్డలు ఆరోపిస్తున్నారు.
నాయకులకి ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే మా గిరిజన గ్రామం గుర్తుకు వస్తుంది తప్ప ఆపద అంటే ఏ ఒక్క రాజకీయ నాయకులు మా వైపు కన్నెత్తి చూడటం లేదని శ్రీరాంపురం ఎస్టి కాలనీ గిరిజనులు వాపోతున్నారు. ఎప్పుడో ఒకసారి తూతూ మంత్రంగా హెల్త్ క్యాంప్ అని పేపర్లకు ఫోజులిచ్చి వెళుతున్నారు తప్ప? మా గ్రామానికి డాక్టర్ కానీ ఆశా వర్కర్ కానీ అంగన్వాడి టీచర్ గాని రోజు విడిచి రోజైనా సరే మా పిల్లలు బాలింతలు గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరిస్థితి స్థితిగతులను చూడటం లేదని గిరిజన ప్రజలు చెబుతున్నారు. రోగం వస్తే పెద్దలు గాని పిల్లలు గాని ఎవరో ఒకరు చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మా గిరిజనులు అంటే నాయకులు గానీ అధికారులు గానీ కనికరం చూపటం లేదు మాపై వివక్ష చూపుతూ మా ప్రాణాలు అంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారని శ్రీరాంపురం ఎస్టి కాలనీ గిరిజనులు వాపోతున్నారు. మా గిరిజన సంఘాలు పేరుకే తప్ప ఆపద వస్తే ఏ ఒక్క గిరిజన నాయకుడు మా వైపు చూసిన దాఖలాలు లేవు ఎలక్షన్ల టైం లోని ఏదైనా కార్యక్రమాలు మీటింగులు ఉన్నాయి అంటే మా గ్రామాల్లో ఉన్న గిరిజన ప్రజలు అవసరం ఉంటుంది అంతే తప్ప గిరిజనుల మీద మక్కుతోనే గిరిజన గ్రామాల్లో ఉన్న సమస్యలు పట్టించుకోరని అంటున్న గిరిజన ప్రజలు జిల్లా అధికారులైన ఆ పై స్థాయి అధికారులైన మా శ్రీరాంపురం ఎస్టి కాలనీ గిరిజనుల గోడు పట్టించుకోని మాకు సరైన వసతులు కల్పించాలని వేడుకుంటున్న శ్రీరాంపురం ఎస్టి కాలనీ గిరిజన ప్రజలు.