రేబిస్.. లక్షణాలతో నాలుగేళ్ల బాలుడు మృతి.
స్థానికుల వివరాల ప్రకారం…
బీర్‌పూర్‌కు చెందిన ఇంద్రాల శిరీష, చంద్రయ్యల మూడో కుమారుడు రక్షిత్(4)పై నెల క్రితం వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు పక్కనే ఉన్న మురుగు కాలువలో పడ్డాడు. దీంతో కుక్క కరిచినట్లు గమనించని తల్లిదండ్రులు.. గాయాలకు మాత్రమే చికిత్స చేయించారు. ఈ క్రమంలోనే రెండు, మూడు రోజులుగా బాలుడు తీవ్ర జ్వరంతోపాటు నీటిని చూస్తే భయపడటం, నాలుకను బయటకు తీస్తుండటంతో జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందాడు.