కౌన్సిలర్ ఆడెపు కమల మధు ఆధ్వర్యంలో “ఉచిత గుండె వైద్యశిబిరం”
కోరుట్ల పట్టణ 15,వ వార్డు కౌన్సిలర్ ఆడెపు కమల మధు ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని భీమునిదుబ్బ సాయి జీనియస్ హైస్కూల్ లో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ “ఉచిత గుండె వైద్యశిబిరం”ను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు ప్రారంభించారు. వైద్య శిబిరంకు విశేష స్పందన లభించింది. మెడికవర్ హాస్పిటల్ వైద్యులు గుండెకు సంబందించిన డాక్టర్, జనరల్ సర్జన్ డాక్టర్ హర్షిత్ బృందం సుమారు 300 మందికి ఉచిత పరీక్షలు చేసి, 200 మందికి బిపి, షుగర్, ఇసిజి, 02-డిఎకో పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ వార్డులో మరిన్ని వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ప్రజలు వైద్య శిబిరంలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.