Site icon PRASHNA AYUDHAM

అంజన్న సన్నిధిలో భక్తుల సందండి

IMG 20241109 115453217 AE

 

ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 16 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక శనివారం సందర్భంగా భక్తజన సందడి నెలకొంది. ఉదయం నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారులు అభిషేకం, ప్రత్యేక పూజలు ప్రత్యేక హారతి నిర్వహించారు. అనంతరం పక్కనే ఉన్న రామాలయంలో సీతారాముల వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు ప్రత్యేక హారతి నిర్వహించారు. సత్యనారాయణ స్వామి మండపంలో భక్తులు సామూహిక వ్రతాలు ఆచరించారు. దాతల సహకారంతో అన్నదానం చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని ఈఓ సార శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్, చైర్మన్ ఆంజనేయశర్మ ప్రధాన అర్చకులు దేవదత్తశర్మ, ప్రభుశర్మ, దేవిశ్రీ, శ్రీహర్ష శ్రీ చరణ్ శ్రీ వత్సవా శర్మ సిబ్బంది రామకృష్ణ. పాల్గొన్నారు.

Exit mobile version