Site icon PRASHNA AYUDHAM

బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ లో గెలుపొందిన వారికి బహుమతి

IMG 20251010 222636

బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ లో గెలుపొందిన వారికి బహుమతి

స్పోర్ట్స్ నిర్వహించిన శివ రుద్ర యూత్ వెల్ఫేర్ అసోసియేషన్

జమ్మికుంట ఇల్లందకుంట అక్టోబర్ 10 ప్రశ్న ఆయుధం

శుక్రవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ ను శివ రుద్ర యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు గుత్తికొండ పవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ స్పోర్ట్స్ లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రధానం చేశారు కబడ్డీ, వాలీబాల్ ,బ్యాట్మెటన్, చెస్,రన్నింగ్,షట్పూట్ కార్యక్రమాలు రెండు రోజులు విజయవంతంగా ముగిసాయి అదే విధంగా చెస్ లో మొదటి విజేతగా బోట్ల రాజుకుమార్,కబడ్డీ మొదటి విజేతగా హుజురాబాద్ టీం ,రన్నర్ టీమ్ గా శ్రీరాములపల్లి యూత్ టీమ్ గెలుపొందారు వాలీబాల్ మొదటి స్థానంలో చల్లూరు టీం ,ద్వితీయ స్థానంలో మర్రిపల్లిగూడెం టీం ,బ్యాడ్మింటన్ లో శ్రీరాములపల్లి టీమ్ గెలుపొందారు. కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరాములపల్లి గ్రామ కారోబార్ తిప్పారపు వీరన్న, బోట్ల రాజుకుమార్,రవి , టీ ప్రేమ్ చందు,నరేష్,రాములు, టీ రాకేష్ ల చేతులమీదుగా బహుమతులు అందజేశారు ఇట్టి కార్యక్రమo లో శ్రీరాములపల్లి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీరాములపల్లి యువజన సంఘం నాయకులు మహేష్,ధనుష్,మణికంఠ, రాకేష్,తరుణ్ వరుణ్,జేశ్వంత్,బబ్బి,నాగచరణ్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Exit mobile version