హాస్టల్ బాత్రూమ్‌లో ప్రసవించిన బాలిక కేసులో వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు.. !
ప్రకాశం జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న 16 ఏళ్ళ బాలిక గర్భం దాల్చింది. అంతేకాదు తాను చదువుకుంటున్న హాస్టల్ బాత్రూమ్‌లో ప్రసవించిన కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ పేరుతో ఒకరు, బెదిరించి మరొకరు, డబ్బుల ఆశచూపి ఇంకొరు ఆమెపై లైంగిక దాడి చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. బాలిక స్వగ్రామంలో జరిగిన ఈ దారుణానికి బాలిక గర్భం దాల్చింది. భయంతో బాలిక ఎవరికీ చెప్పకపోవడంతో 8 నెలలు గర్భాన్ని మోసిన తరువాత తన హాస్టల్‌లోని బాత్రూమ్‌లో శిశువుకు జన్మనిచ్చింది. ట్రంక్ పెట్టెలో మృత శిశువు…ను దాచిపెట్టింది.తరువాత పోలీసులు మార్చూరీకి తరలించారు. బాధితురాలికి వైద్యం అందించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు యువకులను ఫోక్సో చట్టం కింద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు.
కేజీబీవీలో ఔట్‌సోర్సింగ్‌పై ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న జె.సత్యవతి ప్రతిరోజూ విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాల్సి ఉండగా, పాఠశాలలో బాలిక గర్భంతో ఉన్నప్పటికీ ఇద్దరు ఉద్యోగుల తో పాటు గా గర్భం గుర్తించకపోవటంపై ఆమెను కూడా కలెక్టర్ తమీర్ అన్సారియా గారు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు విద్యార్దిని గర్భం దాల్చడానికి దారితీసిన పరిస్థితులపై పోలీసుల విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల విచారణలో సంచలనాలు..
ఈ విషయాన్ని స్థానిక మహిళా పోలీసు ద్వారా కొత్తపట్నం పోలీసులకు తెలియచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో బాలిక స్వగ్రామానికి చెందిన సైదాబాబు ప్రేమ పేరుతో, అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులురెడ్డి, వెంకటరెడ్డిలు బెదిరించి, డబ్బుల ఆశచూపి లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడినట్టు తేల్చారు. ముగ్గురు నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్‌పీ ఎఆర్ దామోదర్ తెలిపారు..