మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటంకి పూలమాలు వేసి నివాళులర్పించిన ప్రభుత్వ సలహాదారు
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్ను మూశారు. ఆయన మరణం తో శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సలదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాల
దేశానికే కాకుండా ప్రపంచ దేశాలు ఆర్థిక సందిగ్ధం లో ఉన్న సమయంలో తన సలహాl ద్వారా ఎన్నో దేశాలను ఆర్థిక సంక్షోభం నుండి బయట పడేశారన్నారు. మన్మోహన్ సింగ్… 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా పనిచేశారు. ఈ సమయంలో కీలకమైన ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేశారన్నారు.
ప్రధానిగా నెహ్రూ, ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీ తర్వాత అత్యధిక కాలం దేశ ప్రధానిగా ఆయన కొనసాగారు.
మన్మోహన్ సింగ్ దాదాపు 33 ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా సైతం కొనసాగారన్నారు. 1991లో రాజ్యసభలో అడుగుపెట్టిన మన్మోహన్ సింగ్. ఆనాడు ప్రధానిగా పీవీ నరసింహారావు ఉన్న సమయంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆర్థిక శాఖలో సలహాదారుగా, కార్యదర్శిగా, ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారన్నారు. 1991లో దుర్బర ఆర్థిక పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి మన్మోహన్ సింగ్‌ను రాజ్యసభకు పంపి ఆర్థిక మంత్రిగా చేశారు.
లిబరలైజేషన్, ప్రివలైజేషన్, గ్లోబలైజేషన్ పాలసీతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ దే అన్నారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణ ద్వారా నాటి సంస్కరణలు చిరస్థాయిగా నిలిచి పోయాయి అన్నారు.
1991 నుంచి 1996 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే అత్యధిక జిడీపీ 10.2శాతం వృద్ధి రేటు నమోదవ్వగా, వెనుకబడిన వర్గాలకు 27 శాతం సీట్ల కేటాయింపు జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఎందుకు ప్రియా చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇలియాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, అనంత రెడ్డి, భీమ్ రెడ్డి, అబ్రబోయిన స్వామి, భూమి రెడ్డి, నాయకులు బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మినుకూరి బ్రహ్మానందరెడ్డి, కారంగుల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.