Site icon PRASHNA AYUDHAM

అధికారులకు పట్టని ప్రభుత్వ ఆసుపత్రి

*

పట్టించుకోని ప్రజాప్రతినిధి

మందుల కొరత -రోగుల ఇబ్బంది

బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం మూలంగా డ్రైనేజ్ నుండి వచ్చే మురికినీరు ఆసుపత్రి ప్రాంగణంలో ప్రవహించడం వల్ల విపరీతమైన దుర్వాసన వస్తున్న అధికారులకు పట్టింపే లేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,అడ్వకేట్ యెర్రా కామేష్ ఆరోపించారు.ఆదివారం పార్టీ శ్రేణులతో కలసి ఆసుపత్రి సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు సుమారు 600 మందికి పైగా ఔట్ పేషంట్స్ వచ్చే ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన డాక్టర్లు లేక ఉన్న డాక్టర్లు కూడా సమయానికి రాక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.ఆసుపత్రిలో మందులు లేక,నొప్పులకు వాడే డైక్లోపీనాక్ లాంటి ఇంజెక్షన్లు కూడా లేక రోగులకు కట్టడానికి బ్యాండేజ్ లు కూడా లేకపోవడం చాలా దారుణమన్నారు.ప్రభుత్వాసుపత్రిలో సమస్యల గురించి ఎన్నిసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా…పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని ఆరోపించారు.స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై కనీసం దృష్టిసారించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రోగాలు నయం చేసుకునేందుకు వచ్చే ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రాంగణం…లేని రోగాలను తీసుకొచ్చేలా ఉందని ఆరోపించారు.ప్రజారోగ్యం పట్టని పాలకుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు.ఔట్ పేషంట్స్ స్లీప్ లు ఉదయం 9గంటలకు మొదలు పెడితే కొంత మంది వైద్యులు 10 గంటల తర్వాత ఆసుపత్రికి వస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసం తక్షణమే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఇన్ పేషెంట్లు,ఔట్ పేషెంట్లకు సరైన వైద్య చికిత్సలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని,జిల్లా అధికారులు డాక్టర్ల కొరత అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డాక్టర్ల నియామకం చేపట్టాలని,మందుల కొరతను నివారించాలని లేని పక్షంలో ప్రజలతో మమేకమై ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందే దీక్షకు పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈకార్యక్రమంలో బహుజన కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,వినయ్,అబ్దుల్,హరికృష్ణ,తరుణ్త దితరులు పాల్గొన్నారు

Exit mobile version