సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): నిజాంపూర్ గ్రామంలో 2008 -2009 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ యం.ఈశ్వరయ్య పాల్గొన్నారు. మొదటగా విద్యార్థులు తమకు మంచి బుద్దులు నేర్పిన ఉపాధ్యాయ బృందాన్ని పూల వర్షం కురిపిస్తూ వేదిక పైకి ఆహ్వానించారు. ఉపాధ్యాయులందరూ కలిసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీహరి నాగరాణి దంపతుల కుమార్తె రిశ్వితా శ్రీ, నాగలక్ష్మి కుమార్తె నందిని చిన్నారులు తమ యొక్క కూచిపూడి, భరతనాట్యంతో అందరిని అలరించారు. విద్యార్థిని, విద్యార్థులు తమ తమ సమాచార వివరాలను ప్రతి ఒక్కరూ వివరించారు. తరువాత ఉపాధ్యాయులు తరగతి గదిలో జరిగిన సంఘటనలను, తీపి జ్ఞాపకాలను తమ యొక్క అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఈశ్వరప్ప, గణితశాస్త్రం రవికుమార్, బయాలజీ నాగభూషణం, గణిత శాస్త్రం మాయాఫద్దీన్, భౌతికశాస్త్రం మహేందర్, ఆంగ్ల శాస్త్రం సువర్ణ, పీడీ రామాగౌడ్, కంప్యూటర్ బోధకులు సోమశంకర్ తదితరులు ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. వారందరికి చిరు జ్ఞాపికను అందజేశారు. విద్యార్థిని, విద్యార్థుల ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఉపాధ్యాయులందరూ విద్యార్థిని, విద్యార్థులందరికీ శుభాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, సిద్ధి రాములు, జగన్, మహేష్, మల్లేశం, భాను ప్రకాష్, మనీషా, నాగరాణి, లక్ష్మి, విశాల, పద్మ, రాజు, హనుమంతు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
*నిజాంపూర్ గ్రామంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం*
Oplus_0