శివ్వంపేట మండల వ్యాప్తంగా ఘనంగా బోనాల ఊరేగింపు
ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 28(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆషాడం మాసం నాలుగవ ఆదివారం పురస్కరించుకొని గ్రామంలో గ్రామ దేవతలకు బోనాల ఊరేగింపు నిర్వహించారు. మహిళలు మట్టికుండలో అమ్మవారికి నైవేద్యం తీసుకొని డప్పు చప్పుళ్ళుతో కల్లుగటం, పోతరాజుల విన్యాసాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పేద ఎత్తున పాల్గొన్నారు