మియాపూర్ కల్వరి టెంపుల్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

మియాపూర్ కల్వరి టెంపుల్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

ప్రశ్న ఆయుధం డిసెంబర్ 25: శేరిలింగంపల్లి ప్రతినిధి

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కల్వరి టెంపుల్ లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.నగరంలో ప్రఖ్యాతిగాంచిన మియాపూర్ కల్వరి టెంపుల్‌లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా కన్నుల పండుగగా జరిపారు .ఈ ప్రసిద్ధ టెంపుల్ కు నగరం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తండోప తండాలుగా తరలి కల్వరి టెంపుల్ దారి పట్టారు. సుశిక్షితులైన వాలంటీర్ వ్యవస్థ ను కల్వరి టెంపుల్ నిర్వహకులు ఏర్పాటు చేసి విశ్వాసుల కీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. యేసు దాసులు ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బ్రదర్ సతీష్ కుమార్ క్రీస్తు సందేశాన్ని సంఘ సభ్యులకు వినిపించారు.క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియజేసే లఘు నాటికలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేలాది మంది విశ్వాసులు ఈ కార్యక్రమం లో పాల్గొని ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Join WhatsApp

Join Now