Site icon PRASHNA AYUDHAM

ఘనంగా గ్రంధాలయ వారోత్సవ ముగింపు వేడుకలు

ఘనంగా గ్రంధాలయ వారోత్సవ ముగింపు వేడుకలు

ప్రశ్న ఆయుధం, నవంబర్ 20, కామారెడ్డి :

స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల కామారెడ్డి లో బుధవారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. ఏడు రోజులుగా వివిధ కార్యక్రమాలతో వారోత్సవాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే.కిష్టయ్య మాట్లాడుతూ కళాశాల గ్రంథాలయం యూనివర్సిటీని తలపించే విధంగా అన్ని సౌకర్యాలతో పాఠకులకు జ్ఞానాన్ని పెంపొందించే అతిపెద్ద గ్రంథాలయం అని తెలిపారు. విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని కోరినారు, దీనివల్ల విజ్ఞానంతో పాటు ప్రముఖుల జీవిత చరిత్ర విశేషాలను తెలుసుకోవచ్చని, పోటీ ప్రపంచంలో వివిధ పోటీ పరీక్షలు సంబంధించిన పుస్తకాలు, మెటీరియల్స్ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత ఉద్యోగాలు పొందాలని ఆశించారు.

గ్రంథ పాలకులు లక్ష్మణాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు గ్రంథాలయం పట్ల అవగాహన కల్పించి వనరులను, సేవలను వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఏ.సుధాకర్, డాక్టర్ విశ్వప్రసాద్ ,డాక్టర్ జి. శ్రీనివాసరావు, డాక్టర్ దినకర్ అంకం జయ ప్రకాష్ మరియు బోధ నేతర సిబ్బంది, అధిక సంఖ్యలోవిద్యార్థులు పాల్గొన్నారు.

Exit mobile version