ఘనంగా ఎంఎస్ఎస్ఓ క్రికెట్ టోర్నమెంట్

  • ఘనంగా ఎంఎస్ఎస్ఓ క్రికెట్ టోర్నమెంట్

గజ్వేల్ 15 జనవరి 2025 :

మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన సందర్భంగా గజ్వేల్ లో మైనంపల్లి సేవాసమితి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు బురుజు కింది ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నీ గత మూడు రోజులుగా అట్టహాసంగా నిర్వహించి బుధవారం క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు వైభవంగా నిర్వహించారు, విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం బురుజుకింది ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు హనుమంతరావు జన్మదిన సందర్భంగా గజ్వేల్ లో ఏర్పాటు చేసిన క్రికెట్ గవర్నమెంట్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొహన్న గారి రాజు,కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఇక్బాల్, కాంగ్రెస్ యువ నాయకులు గాడిపల్లి అనూప్, బంగారు రెడ్డి, కరుణాకర్ రెడ్డి,పంజలా రవి గౌడ్, ,సమీర్, లతీఫ్ , హరి చంద్ర ప్రసాద్,షేర్ల భాస్కర్,ఎమ్మెస్ యాదవ్, ఖాజా, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు,క్రికెట్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now