లక్ష డప్పులు-వెయ్యి గొంతుల మహా ప్రదర్శనను విజయవంతం చేయాలి

లక్ష డప్పులు-వెయ్యి గొంతుల మహా ప్రదర్శనను విజయవంతం చేయాలి

* చిగురుమామిడిలో కలబృందానికి ఘన స్వాగతం పలికిన ఎమ్మార్పీఎస్ నాయకులు..

* ఫిబ్రవరి 7న కళాకారుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాకళ ప్రదర్శన..

చిగురుమామిడి,జనవరి 5:ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 7న జరిగే లక్ష డప్పులు వెయ్యి గొంతులా మహాకళ ప్రదర్శనకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని సమన్వయ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ రామంచ భరత్ పిలుపునిచ్చారు.ఫిబ్రవరి 7న జరిగే లక్ష డప్పులు,వెయ్యి గొంతుల హైదరాబాద్ లో జరిగే మహాకళ ప్రదర్శన విజయవంతం చేయడంలో భాగంగా ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రానికి విచ్చేసిన వెయ్యి గొంతులు,లక్ష డప్పుల కళా బృందానికి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దొబ్బల బాబు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం ఎమ్మార్పీఎస్ చిగురుమామిడి మండల అధ్యక్షులు దొబ్బల బాబు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా సమన్వయ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ రామంచ భరత్ హాజరై మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయకుండా మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తుందని దానికి నిరసనగా మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఫిబ్రవరి 7న కళాకారుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి 30సంవత్సరాల మాదిగల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు,లేని పక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దొబ్బల బాబు,జిల్లా అధ్యక్షులు అంబాల ప్రభాకర్,బోయిని సమ్మయ్య,కళామండలి మహిళా నాయకురాలు దండు వరలక్ష్మి,సౌందర్య,ఎమ్మెస్పీ సీనియర్ నాయకులు కాథ మల్లయ్య,ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు

చెంచల నవీన్,ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి ఎడేల్లి సంపత్,ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిల్లాల రమేష్,ఎంఎస్పి సీనియర్ నాయకులు ఆది మల్లయ్య,ఎమ్మార్పీఎస్ చిగురుమామిడి మండల నాయకులు కాత తిరుపతి, జిల్లాల నాంపల్లి,

ఎంఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కనకము గంగ నరేష్,ఎమ్మార్పీఎస్ నాయకులు బోయిని శ్రీనివాస్, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ప్రతి గ్రామం నుండి డబ్బుతో పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని దెబ్బల బాబు కోరారు.

Join WhatsApp

Join Now