ఘనంగా ఉట్టి పండుగ

*గడ్డివానిపల్లి కృష్ణాష్టమి ఘనంగా ఉట్టి పండుగ*

* జమ్మికుంట /ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 27*

మండలంలోని గడ్డివాని పల్లె గ్రామంలో సోమవారం రోజున రాత్రి యాదవ సంఘం అధ్యక్షుడు గడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమిని పురస్కరించుకొని అన్ని కులాల వారు కలిసి శ్రీకృష్ణ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకొని ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు గత పది సంవత్సరాలుగా యాదవ కుల దైవమైనటువంటి శ్రీకృష్ణుని జన్మదినం రోజున ఉట్టి పండుగను నిర్వహిస్తారు యాదవ కులస్తుల అందరం కలిసి ఉట్టి పండుగలో పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు గీత సారాంశాన్ని ప్రపంచానికి తెలిపిన మహనీయుడు మహా పురుషుడు శ్రీకృష్ణుడని వివిధ అవతారాలు అవతరించి లోక కళ్యాణం జరిపించాలని గడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో యదవ సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు

Join WhatsApp

Join Now