*అంబేద్కర్ స్పోర్ట్స్ క్లబ్ సిరిసేడు లో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్*
*మూడు జిల్లాల నుండి పాల్గొన్న 23జట్లు*
*ఇల్లందకుంట జనవరి15 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో అంబేద్కర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా మెగా వాలీబాల్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. బుధవారం సిరిసేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన టోర్నమెంట్‌కు వరంగల్,ములుగు కరీంనగర్ జిల్లాల నుండి 23 జట్లు ఉత్సాహంగా పాల్గొని టోర్నమెంట్ ఉదయం 10గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వాలిబాల్ పోటీలు నిర్వహించారు 23 జట్లలో ఫైనల్ మ్యాచ్ లో కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలంలోని పర్లపల్లి జట్టు తో ములుగు జిల్లాలోని బూరుగుపల్లి జట్టు తలపడగా రెండు జట్లు హోరాహోరీగా నువ్వా నేనా అంటూ గట్టి పోటీనే ఇస్తూ తలపడగా విజేతగా పర్లపల్లి జట్టు గెలుపొందింది.. గెలుపొందిన టీం కు జమ్మికుంటకు చెందిన జయ బోర్ వెల్స్ యజమాని, బుడిగజంగాల కులసంఘం అధ్యక్షుడు తూర్పాటి లింగయ్య 10,016 రూపాయలు నగదు అందించారు.. ఓరహోరిగా పోరాడి ఓడిన బూరుగుపల్లి జట్టు కి సిరిసేడు కి చెందిన వంగ రామకృష్ణ 5016 రూపాయలు నగదు అందించారు.. ఫైనల్ మ్యాచ్ లో తలపడిన రెండు జట్లకి మెడల్స్, ట్రోపి మెమొంటోనీ జమ్మికుంట స్రవంతి జూనియర్ కళాశాల యాజమాన్యం అందించారు.. టోర్నమెంట్ లో పాల్గొన్న 23 జట్ల క్రీడాకారులకు దాసరి శ్యామ్ సుందర్, గురుకుంట్ల సంజీవ్ సహకారంతో భోజన వసతి కూడా అందించినట్లు తెలిపారు…టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన గ్రామ ప్రజలకు, క్రీడ అభిమానులకు, క్రీడాకారులకు టోర్నమెంట్ నిర్వాహకులు రామంచ చింటూ, రామంచ అజయ్ లు ధన్యవాదాలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో కొండ విజయ్, రహమాన్, కొక్కుల దేవేందర్, రేనుకుంట్ల శేఖర్, కంపేట సంతోష్, హనుమంత్,బలబత్తుల వర్ధన్, సాగర్, గ్రామస్తులు క్రీడాకారులు పాల్గొన్నారు..